ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని ఫోన్​..కానీ ఆ తర్వాత..! - srikakulam district crime

లాక్‌డౌన్‌ సమయంలో ఎందరో అభాగ్యులకు సహాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నటుడు సోనూసూద్. ఇప్పుడు అతని పేరును అడ్డం పెట్టుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో సోనూసూద్ పేరుతో ఫోన్​ చేసి, సహాయం చేస్తానని నమ్మించి డబ్బులు దండుకున్నాడు ఓ ఆగంతకుడు.

సంతబొమ్మాళిలో సోనూసూద్ పేరుతో మోసం
సంతబొమ్మాళిలో సోనూసూద్ పేరుతో మోసం

By

Published : Aug 10, 2021, 8:01 PM IST

Updated : Aug 10, 2021, 8:50 PM IST

సంతబొమ్మాళిలో సోనూసూద్ పేరుతో మోసం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన రాంబాబు.. కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. తండ్రి కరోనాతో మృతి చెందగా, తల్లి పక్షవాతంతో మంచానికి పరిమితమైంది. రాంబాబు ఇబ్బందులను గమనించిన అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని కోరారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఓ అగంతకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.

సోనూసూద్​ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు ఫోన్ చేశాడు. ట్రస్ట్ ద్వారా రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తానని నమ్మించాడు. దీనికోసం రూ.1ం వేలు జీఎస్టీ కట్టాలని, రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం ముందుగా రూ.2 వేలు ఫోన్ పే చేయాలని చెప్పాడు. నిజమేనని నమ్మిన రాంబాబు తన మిత్రుడి సహాయంతో రూ.2వేలు పంపించాడు. గంట తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేశాడు. అగంతకుడు కర్ణాటక వాసిగా గుర్తించినట్లు ఎస్​ఐ గోవింద్​ తెలిపారు.

ఇదీచదవండి.

ANTARVEDI: ముందుకొస్తున్న సముద్రం.. భయాందోళనలో గ్రామస్థులు

Last Updated : Aug 10, 2021, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details