శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా వైరస్ వ్యాప్తి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. నరసన్నపేటలో 17 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల పరిధిలో 44 కరోనా కేసులు నమోదయ్యాయి.
కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆర్డీవో ఎం.వి. రమణ.. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలకు కంటైన్మెంట్ జోన్లలో అనుమతి ఉంది. ఈ సమయాన్ని కుదించే విషయంపై అధికారులు చర్చించారు.