ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారమైనా దొరుకుతుందేమో.. ఇసుక దొరికేలా లేదు! - ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. నిర్మాణ కార్మికులను పస్తులుండే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు.

chandrababu on ap govt sand policy

By

Published : Oct 21, 2019, 3:17 PM IST

Updated : Oct 21, 2019, 3:52 PM IST

శ్రీకాకుళం తెదేపా సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు

ఒకప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తానంటే విమర్శించారని.. ఇవాళ ఇసుక కొరతను తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. పనుల్లేక పస్తులుండే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారమైనా దొరుకుతుందేమో గానీ.. ఇసుక దొరికే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ హయాంలో విద్యుత్‌ కొరతను అధిగమించి మిగులు విద్యుత్‌ సాధించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఎండాకాలం రాకముందే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. దోమలపై యుద్ధం అంటే తనపై విమర్శలు చేశారని.. ఇవాళ విద్యుత్‌ కోతలతో ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు విమర్శించారు.

Last Updated : Oct 21, 2019, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details