జగన్ రెడ్డి పాలనలో ఎస్సీలకు జీవించే హక్కు లేదా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా స్పాన్సర్ చేస్తున్న క్రూరత్వం, పిచ్చితనం ఎప్పుడు ఆగుతుందని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ యువకుడిని సీఐ బూటు కాలితో తన్నటాన్ని ఖండించారు. బాధితుడి తల్లి తన కుమారుడిని రక్షించుకోవటానికి ప్రయత్నించినప్పుడు కూడా పోలీసు తన్నటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
'జగన్ రెడ్డి పాలనలో ఎస్సీలకు జీవించే హక్కు లేదా' - శ్రీకాకుళం ఘటనపై లోకేశ్ స్పందన వార్తలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దళిత యువకుడిని సీఐ తన్నటంపై.. తెదేపా అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీలకు జీవించే హక్కు లేదా అంటూ నిలదీశారు.
మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారనీ... ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడ్డాడని వరప్రసాద్‌కి శిరోముండనం చేశారనీ.. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్‌పై దాడికి దిగారని లోకేశ్ మండిపడ్డారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల్లా వ్యవహరిస్తూ.. ప్రజలను హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రాజధాని విషయంలో కలగజేసుకోవాలని చెప్పటానికి మీరెవరు?