శ్రీకాకుళం జిల్లా పలాసలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే... కరోనా లక్షణాలు ఉన్నాయని మృతదేహాన్ని జేసీబీతో తీసుకెళ్లటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. చనిపోయిన వారికి తగిన గౌరవం లేకుండా... జేసీబీలతో మృతదేహాన్ని తరలించటం కలచి వేసిందని విచారం వ్యక్తం చేశారు.
'చనిపోయిన వారికిచ్చే గౌరవం ఇదేనా?' - కరోనా మృతదేహాల కననంపై చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ప్రొక్లెయిన్‌తో తరలించడంపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ మండిపడ్డారు. చనిపోయిన వారికి తగిన గౌరవం లేకుండా జేసీబీలతో తరలించటం కలచి వేసిందని అన్నారు.
'చనిపోయిన వారికిచ్చే గౌరవం ఇదేనా?'
మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వ చర్యలు సిగ్గు చేటని దుయ్యబట్టారు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని నిలదీశారు. సీఎం జగన్ మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి సంబంధమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను వారు ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: 'కారు' చౌకగా షి'కారు' చేద్దాం.. సొంత వాహన కొనుగోలుకే మొగ్గు..
Last Updated : Jun 27, 2020, 1:26 AM IST