ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అచ్చెన్నాయుడికి అత్యున్నత వైద్యం అందించాలి' - అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

గుంటూరు జీజీహెచ్​లో ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడికి మరోసారి శస్త్రచికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే వైద్యులకు ఫోన్ చేసి అచ్చెన్న ఆరోగ్యంపై వాకబు చేశారు. అత్యున్నత వైద్యం అందించాలని కోరారు.

tdp leader chandra babu
tdp leader chandra babu

By

Published : Jun 17, 2020, 4:07 PM IST

తెదేపా నేత అచ్చెన్నాయుడుని 21 గంటలు పోలీసు వాహనంలో కూర్చోబెట్టడం వల్లే గాయం తిరగబెట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీవీ ఛానళ్లలో అచ్చెన్న అనారోగ్యంపై వార్తలు చూసి హుటాహుటిన జీజీహెచ్ సూపరింటెండెంట్​కు చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండోసారి శస్త్రచికిత్స, గాయం తిరగబెట్టడంపై ఆరా తీశారు.

అచ్చెన్నాయుడికి రక్తస్రావం ఆగడం లేదని, అందుకే మళ్లీ శస్త్రచికిత్స చేశామని గుంటూరు వైద్యులు చంద్రబాబుకు వివరించారు. అత్యున్నత వైద్యం అందించాలని వారిని తెదేపా అధినేత కోరారు. మరోవైపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు. అచ్చెన్న భార్య విజయ మాధవిని ఓదార్చారు. తెదేపా అండగా ఉంటుందని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details