అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులతో తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్ ఫోన్లో మాట్లాడారు. కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని అచ్చెన్నాయుడి భార్య విజయ తెలిపారు. తమతో మాట్లాడే అవకాశం లేకుండా తీసుకెళ్లారని వాపోయారు.
ఇలాంటి బెదిరంపులకు ఏమి భయపడవద్దని... పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ ఆమెకు భరోసా ఇచ్చారు. కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి అరెస్టులని అన్నారు. ఆధారాల్లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని...అధికారులపై ఎంత ఒత్తిడి ఉందో బయటపడిందని దుయ్యబట్టారు. అచ్చెన్న అరెస్టుతో మరోసారి జగన్ కుట్ర బయటపడిందని ఆయన ధ్వజమెత్తారు.
త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని లోకేశ్ అన్నారు.
జనాలందరూ చూస్తున్నారు. ఏమి చెప్పలేదు. మేం లోపలే ఉన్నాము. జనాలందరూ చూస్తూ వీడియో చిత్రీకరిస్తుంటే వాటినీ లాక్కున్నారు సర్. వాళ్లు వెంటనే పైకొచ్చి..ఆరోగ్యం బాగాలేదని అంటున్న తనని కిందకి తీసుకెళ్లారు. తన మాటలు వినబడి బయటికి వచ్చేలోపే తీసుకెళ్లిపోయారు. ఇంటి దగ్గరికి మూడువందల మందికిపైగా వ్యక్తులు వచ్చారు. వారం రోజుల నుంచి బాలేదు అన్న విన్లేదు. ఎవర్ని ఇక్కడికి రానివ్వకుండా పోలీసులు ఉన్నారు సర్. హెడ్‌క్వార్టర్‌లో జంక్షన్లో పోలీసులు ఉన్నారు. ఎవర్ని ఇక్కడికి అనుమతించట్లేదు సార్. -చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన అచ్చెన్నాయుడి భార్య విజయ