శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని బొత్స పేర్కొన్నారు. ఈయనతో పాటు విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స - అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు న్యూస్
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బొత్స
స్వామివారిని దర్శించుకున్న కూన రవికుమార్..
రథసప్తమి వేడుకల్లో భాగంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని తెదేపా శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్షులు కూన రవికుమార్ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు పలువురు అధికారులు విచ్చేశారు.