రాష్ట్ర ప్రభుత్వం పలు బీసీ కార్పొరేషన్లను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన మూడు కులాలకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా పంగ కృష్ణవేణి, పొందర కార్పొరేషన్ చైర్మన్ గా రాజాపు హైమావతి, శ్రీశైయన కార్పొరేషన్ చైర్మన్ గా చీపురు రాణి నియమితులయ్యారు.
బీసీ కార్పొరేషన్ల ప్రకటనపై.. నసరన్నపేటలో సంబరాలు - srikakulam district narasannapeta news update
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.
![బీసీ కార్పొరేషన్ల ప్రకటనపై.. నసరన్నపేటలో సంబరాలు Celebrations at narasannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9220807-42-9220807-1603011915261.jpg)
బీసీ కార్పొరేషన్ ను ప్రకటించడంతో ఘనంగా వేడుకలు
ఈ విషయమై నరసన్నపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. భారీ స్థాయిలో బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: