ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది.. ఆ తర్వాత.. - srikakulam district updates

అధికారులు ఒకటికి రెండు సార్లు ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాకే లంచాలు తీసుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి మాత్రం సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

cctv showed the officer took the bribe in srikakulam district
సీసీ కెమెరాకు చూపించి మరీ... లంచం తీసుకున్న అధికారి

By

Published : Feb 7, 2021, 9:25 AM IST

శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో ఓ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆమె పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు.

సీసీ కెమెరాకు చూపించి మరీ... లంచం తీసుకున్న అధికారి

ABOUT THE AUTHOR

...view details