ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు - TDP leaders Achennaidu and Rammohan Naidu latest news

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుపై కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బైక్ ర్యాలీ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు
తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు

By

Published : Nov 2, 2021, 9:53 PM IST

తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడిపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్​ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వారితో మరో 48 మంది తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బైక్ ర్యాలీ నిర్వహించారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది...

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో తెలుగుదేశం శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి నందిగాం మండలంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే అట్టాడ జనార్ధన నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదని సీఐ వెంకట గణేష్ చెప్పడంతో అచ్చెన్నాయుడు పోలీసుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహాల ఆవిష్కరణకు వెళ్తుంటే అనుమతి ఎందుకని నిలదీశారు. అనంతరం టెక్కలి మీదుగా నందిగాం వరకు ర్యాలీ జరిపారు.

ఇదీ చదవండి:

తెదేపా ద్విచ్రక్ర వాహన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details