ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JAILED: అంపోలు జిల్లా జైలుకు అంగన్వాడీ కార్యకర్తలు - case filed on anganwadi workers

శ్రీకాకుళం జిల్లాలో జూలై 3న బత్తిలి చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ పాలప్యాకెట్ల కేసులో 27 మంది అంగన్వాడీ కార్యకర్తలకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. వారిని అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు.

అంపోలు జిల్లా జైలుకు అంగన్వాడీ కార్యకర్తలు
అంపోలు జిల్లా జైలుకు అంగన్వాడీ కార్యకర్తలు

By

Published : Aug 14, 2021, 10:22 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం, వంగర మండలాల్లోని అంగన్వాడీ కార్యకర్తలపై కేసు నమోదైంది. జూలై 3న బత్తిలి చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన పాలప్యాకెట్లకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలకు అందించవలసిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో.. 27 మందిపై అభియోగాలు దాఖలయ్యాయి. వారిని కోర్టులో హాజరు పరచగా.. కొత్తూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. వారిని పోలీసులు అంపోలు జిల్లా జైలుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details