మందేశాడు...కారు తీశాడు..బీభత్సం సృష్టించాడు! - car accident in srikakulam district news
శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
car accident in srikakulam district
శ్రీకాకుళం ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి... ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో కారు పైకి లేచి పక్కనే ఉన్న ద్విచక్రవాహనాలపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్ష చేశారు. బ్రీత్ అనలైజర్ 248 పాయింట్లు చూపించడంతో... కేసు నమోదు చేశారు.