శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. తిమ్మారెడ్డి గోవింద అనే వ్యక్తి విజయనగరం జిల్లా బోగాపురం నుంచి బాణాసంచా కొనుగోలు చేసి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం సైలెన్సర్ వేడెక్కి... దానికి ఆనుకుని ఉన్న మందుగుండు సామాగ్రిలో పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో వాహనదారుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
రణస్థలంలో ప్రమాదం... బాణాసంచా పేలి ద్విచక్రవాహనం దగ్దం - byke fired due to diwali crackers in srikakulam ranastalam
దీపావళి పండగ వేళ అత్తారింటికి టపాసులతో ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బాణాసంచా సంచి సైలైన్సర్ కు ఆనుకుని ఉంది. వేడెక్కిన సైలెన్సర్... మందుగుండు సామాగ్రికి మంటపెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుందా...
రణస్థలంలో ప్రమాదం... బాణాసంచా పేలి ద్విచక్రవాహనం దగ్దం
ఇవీ చూడండి-ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది