శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న బస్సు కల్వర్టులో ఇరుక్కుపోయింది. ఘటన సమయంలో బస్సులో సిబ్బందితో సహా 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా కుదుపులకు గురికావడం ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సు నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కల్వర్టులో ఇరుక్కున్న బస్సు.. తప్పిన ముప్పు
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న బస్సు కల్వర్టులో ఇరుక్కుపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కల్వర్టులో ఇరుక్కున్న బస్సు