ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంబోతుల సమరం.. ఆందోళన చెందిన జనం - today bulls fighting at srikakulam district news

ఇచ్చాపురంలో రెండు ఆంబోతులు నువ్వా.. నేనా అన్నట్టు తలపడ్డాయి. పట్టణం నడి బొడ్డున నందన్నల పోరు చూసి.. స్థానికులు భయాందోళన చెందారు. ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. తమవైపు అవి రాకుంటే చాలు దేవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి బయటపడ్డారు. దాదాపు గంటపాటు ఆంబోతుల పోట్లాట అందరినీ కలవరపరిచింది.

bulls fighting
నందన్నల పోరు

By

Published : Apr 4, 2021, 2:48 PM IST

Updated : Apr 4, 2021, 6:16 PM IST

ఆంబోతుల సమరం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి బజారు కూడలి వద్ద ప్రధాన రహదారిపై నందన్నల (ఆంబోతులు) పోట్లాట.. ప్రయాణికులు, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ పోరులో.. ప్రధాన రహదారిపై వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.

రోడ్డుపై రద్దీ తీవ్రంగా ఉండటం.. ఆంబోతులు పోట్లాడుకుంటా ప్రయాణికుల వైపు దూసుకెళ్లటం లాంటి పరిణామాలు.. అక్కడి వారిని ఆందోళన కలిగించాయి. రహదారులపై ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపాలిటీ అధికారులు తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Apr 4, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details