శ్రీకాకుళం జిల్లా పాలకొండ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. కార్మికులు నిరసన చేపట్టారు. లాక్ డౌన్ లో పని కోల్పోయి ఇంటికి పరిమితమైన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ద్వారా రూ.10,000 ప్రతి నెల చెల్లించాలని కోరారు. వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లెయిమ్ లన్నింటికీ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
భవన కార్మికుల నిరసన.. ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ - భవన కార్మికుల నిరసన.. ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్
లాక్ డౌన్ లో పని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు.. తమకు ఆర్థిక సహాయం చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిరసనకు దిగారు.
భవన కార్మికుల నిరసన