శ్రీకాకుళంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య - ap crime news
14:15 March 26
Murder in Srikakulam: కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు
Srikakulam Crime News: శ్రీకాకుళం పట్టణం గూనపాలెంలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణం హత్య జరిగింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనతో గూనపాలెం ఉలిక్కిపడింది. రెండు ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు.. గొడ్డలితో దాడి చేయగా కరుణ్రాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. హరి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్‌కు తరలించారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత గొడవలే ఈ హత్యకు దారి తీశాయని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు. "గూనపాలెంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఓ ద్విచక్రవాహనాన్ని కాల్చివేశారు. దీని మీద పోలీసుస్టేషన్లో కొంతమందిపై ఫిర్యాదు చేయగా.. వాళ్లను పోలీసులు మందలించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వారే.. ఈ హత్య చేశారు" అని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:Accident: కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు