శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక పీబీ నగర్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. అన్నదమ్ములు మృతిచెందారు. పెదరావుపల్లి పంచాయతీ నక్కపేటకు చెందిన అన్నదమ్ములు చింతపల్లి శంకర్, రాంబాబు.. మురపాల గ్రామంలో సరకులు కొనుగోలు చేసి.. ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. 27 ఏళ్ల శంకర్... భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి.. విశాఖలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 19 ఏళ్ల రాంబాబు.. స్వగ్రామం నక్కపేటలోనే... తల్లి, సోదరితో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు సోదరులు ఒకేసారి మృతిచెందడంతో... కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
దారుణం.. అన్నదమ్ములిద్దరు సరుకుల కోసం వెళ్లి వస్తుండగా....! - accident news
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక పీబీ నగర్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. ఆ తల్లికి కడపుకోత మిగిల్చింది. పెద్ద దిక్కులను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం