ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావుల గ్రామం వద్ద కుప్పకూలిన వంతెన - Srkakulam District Latest news

నరసన్నపేట మండలం రావుల గ్రామం వద్ద మేజర్ కాలువపై పంచాయతీరాజ్ రహదారికి అనుసరించి ఉన్న వంతెన కుప్పకూలింది. వంతెన కూలిపోవడంతో రావుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

Bridge collapse at Ravula village
రావుల గ్రామం వద్ద కుప్పకూలిన వంతెన

By

Published : Nov 1, 2020, 10:34 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావుల గ్రామం వద్ద మేజర్ కాలువపై పంచాయతీరాజ్ రహదారికి అనుసరించి ఉన్న వంతెన ఆదివారం రాత్రి కుప్పకూలింది. ఈ రహదారి మీదుగా టిప్పర్ లారీ వెళుతుండగా వంతెన కాలువలోకి కూలింది. దీంతో లారీ కూడా కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లారీ సిబ్బంది బయటపడ్డారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. వంతెన కూలిపోవడంతో రావుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్లు, ప్రొక్లెయిన్ సాయంతో లారీని బయటికి తీసేందుకు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details