ఇదీ చూడండి:
విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ధర్మపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పలాస మండలం సున్నాడకు చెందిన బాలుణ్ని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి చెప్పారు. గత నెల 26న ధర్మపురం గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రేమను కాదన్నందుకు విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ తెలిపారు.
విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్