Minister Botsa Satyanarayana on Jayaho BC Mahasabha: ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి తప్పించామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్ణం చేశారు. శ్రీకాకుళం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి బొత్స పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభను జయప్రదం చేయాలని.. శ్రీకాకుళం జిల్లా పార్టీ శ్రేణుకు బొత్స పిలుపునిచ్చారు.
'జయహో బీసీ' మహాసభను జయప్రదం చేయాలి: బొత్స సత్యన్నారాయణ
Minister Botsa Satyanarayana: ఈనెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభను జయప్రదం చేయాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలను సేవకులుగా వాడుకున్నారని బొత్స ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో బీసీలకు ఒక్క కార్పొరేషన్ పదవి ఇచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు.
బొత్స సత్యన్నారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను సేవకులుగా వాడుకున్నారని బొత్స ఆరోపించారు. తమ ప్రభుత్వంలో బీసీలు తలెత్తుకు తిరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తెలుగుదేశం హయాంలో బీసీలకు ఒక్క కార్పొరేషన్ పదవి ఇచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదు ఏళ్లలో ఎన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని సత్యనారాయణ ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
TAGGED:
AP SKLM