పలాస - కాశీబుగ్గ పుర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై పోరు మెుదలైంది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు మాత్రమే ఇవ్వటంపై బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకు పనిచేసిన పోలింగ్ కేంద్రాలు కాకుండా వేరే సెంటర్లను కేటాయించటంపై మండిపడ్డారు. ఓటర్లు జాబితాలు లేకుండా కొత్త ప్రాంతాల్లో ఎలా పనిచేస్తామని అధికారుల్ని నిలదీశారు. తమకు ఓటరు జాబితాతో పాటుగా.. గతంలో పనిచేసిన పోలింగ్ కేంద్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన - పలాసలో ఓటర్ల జాబితాపై బీఎల్‌వోల నిరసన
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై రగడ మొదలైయింది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు ఎలా పంపిణీ చేస్తామని బీఎల్‌వోలు(బూత్ లెవల్ ఆఫీసర్స్) నిరసన వ్యక్తం చేశారు.
![ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన BLOS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10841488-362-10841488-1614693517999.jpg)
ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన