ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయి' - రక్త నిల్వలపై కరోనా ప్రభావం న్యూస్

రాష్ట్రంలో రక్తనిల్వలు తక్కువగా ఉన్నాయని.. రెడ్‌క్రాస్‌ స్టేట్‌ వైస్‌ ఛైర్మన్‌ జగన్మోహనరావు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

Blood reserves are low in ap
Blood reserves are low in ap

By

Published : Apr 4, 2020, 7:18 PM IST

కరోనా కారణంగా.. రక్తనిల్వలపై ప్రభావం పడిందని రెడ్​క్రాస్ స్టేట్ వైస్ ఛైర్మన్ జగన్మోహనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారితో సహా అత్యవసర రోగులకు అవసరమైన రక్తం తక్షణం అందించేందుకు వీలు కాని పరిస్థితి నెలకొందన్నారు. గర్భిణులు, తలసేమియా, సికిల్‌సెల్‌సేమియా, ఎముక మజ్జ వ్యాధి బాధితులతోపాటు రక్తహీనతతో బాధపడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా రక్తనిధి నుంచి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితి అని జగన్మోహనరావు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details