రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలోని రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయంలో రామ్చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
రామ్చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - srikakulam dst blood donation news
శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేసిన యువతను అభినందించారు.
blood giving center started in srikakulam dst
కరోనా సమయంలో జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని..., ఇటువంటి సమయంలో యువత ముందుకు వచ్చి రక్త దానం చేయటం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.
ఇదీ చూడండి: బస్సుల్లో భౌతిక దూరానికి భరోసా ఏది?