శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజాం పట్టణంలోని సన్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని రాజాం పారిశ్రామికవేత్త, రాజాం వైకాపా పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ ప్రారంభించారు. రాజాంలోని శ్రీ కామాక్షి స్వర్ణకార యువజన సంఘం సభ్యులు, 30 మంది యువకులు రక్తదానం చేశారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు అభినందించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - blood donation camp in srikakulam
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు.

blood donation