ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొరివంక ప్రాథమిక ఆసుపత్రిలో రక్తదాన శిబిరం - borivanka primary health centre latest news

బొరివంక ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో విఎన్ఎమ్ ఫౌండేషన్ చైర్మన్ వజ్రపు వెంకటేష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నలభై మందికి పైగా యువకులు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.

blood donation camp in borivanka primary health centre in srikakulam district
రక్తదానం చేస్తున్న బొరివంక గ్రామ యువకులు

By

Published : Jun 20, 2020, 7:56 PM IST

శ్రీకాకుళం జిల్లా బొరివంక ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని విఎన్ఎమ్ ఫౌండేషన్ చైర్మన్ వజ్రపు వెంకటేష్ శనివారం నాడు ప్రారంభించారు. "ఆ నలుగురు" ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నలభై మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వారికి విఎన్ఎమ్ ఫౌండేషన్ తరపున వైరస్ ప్రోటక్షన్ బాడీ కవర్స్​ను చైర్మన్ అందజేశారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రక్త నిల్వలు లేక అనేక బ్లడ్​ బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయని వజ్రపు వెంకటేష్ అన్నారు. బొరివంక లాంటి మారుమూల ప్రాంతంలో యువత అధికంగా పాల్గొని రక్తదానం చెయ్యడం శుభపరిణామన్నారు. ఇదే ఆదర్శంగా యువత మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details