ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ నేతృత్వాన్ని ప్రజలు కోరుతున్నారు...: ఎమ్మెల్సీ మాధవ్ - Srikakulam district latest news

సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ నేతృత్వం రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. భాజపా, జనసేన కలిసి శక్తిగా ఎదగడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా భాజాపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైకాపా సర్కారు చేసున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలోని దేవాలయాల్లో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

bjp mlc madhav fire on ycp
సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ నేతృత్వాని ప్రజలు కోరుతునారు

By

Published : Jan 19, 2021, 9:06 PM IST

భాజపా.. రాష్ట్రంలో ప్రభలమైన శక్తిగా ఎదగడం తథ్యం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ నేతృత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. త్వరలోనే పార్టీలో భారీగా చేరికలు జరగబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సర్కారు నిర్లక్ష్యతోనే దేవాలయాలపై దాడులు...

రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యతోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నలుగురు భాజాపా కార్యకర్తలు విగ్రహాల ధ్వంసంలో కారకులు అని డీజీపీ ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన వ్యవస్థగా మార్చుకొని తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

వైకాపా అధికార ప్రతినిధిగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్న మాధవ్‌.. దాడికి పాల్పడిన వారిపైన కాకుండా గురైన వ్యక్తులపైన కేసులు పెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఉందన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details