ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ భూముల అమ్మకాలు ఆపండి' - ప్రభుత్వ భూముల అమ్మకాలు

ప్రభుత్వ భూముల అమ్మకాలు ఆపాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో బినామీలకు చవకగా భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

bjp
bjp

By

Published : May 23, 2020, 6:12 PM IST

వైకాపా ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కేంద్రం ఏపీకి రెవెన్యూ లోటును పూరించడానికి సుమారు 18 వందల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అప్పులతో నడుస్తోందన్న ఎమ్మెల్సీ.. మద్యం అమ్మకాలతో వచ్చిన డబ్బులు తప్ప మరే విధంగా నిధుల సేకరణ చేయట్లేదన్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకానికి భాజాపా పూర్తి వ్యతిరేకం అన్న ఎమ్మెల్సీ.. విలువైన ప్రభుత్వ భూములను ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో బినామీలకు కారుచవకగా భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ సంఘటన దురదృష్టకరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details