దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.
అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ భావిస్తున్నారు. అయితే ఈ ఆలోచనపై మొదట దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. మోదీ ప్రస్తావించిన మాటలనే పవన్ చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని చెప్పలేను. దీనిపై కేంద్రానిదే తుది నిర్ణయం. తూర్పుగోదావరి నుంచే భాజాపా, జనసేన జైత్రయాత్ర కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి భాజాపాలోకి చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారు.