దేశంలో మోదీ సర్కారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పలు అంశాలపై ప్రస్తావించారు. మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్న ఆయన జన్‌ధన్ యోజన పథకం వలన అనేక మంది పేద వర్గాలకు లబ్ది చేకూరిందన్నారు. కోవిడ్ సమయంలో అనేక చర్యలు చేపట్టి.. మోదీ సర్కారు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలించిదని హరిబాబు కొనియాడారు.
'మోదీ సర్కార్ ప్రపంచానికే ఆదర్శం' - bjp leader haribabu latest news update
మోదీ సర్కార్ ప్రపంచానికే ఆదర్శమని భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. సంవత్సర కాలంలో మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, పలు అంశాలపై శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

శ్రీకాకుళం భాజాపా కార్యాలయంలో హరిబాబు