శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని నారాయణపురం ఆనకట్ట కాలువలోని నీరు విడిచిపెట్టకపోవడం వలన దిగువ గ్రామాలకు సాగునీరు అందట్లేదని భాజపా, జనసేన నేతలు తెలిపారు. బూర్జ మండలం నారాయణపురం హై లెవెల్ ఛానల్ భాజపా జిల్లా కోశాధికారి పేడాడ సూరపనాయుడు, జనసేన ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్ పేడాడ రామ్మోహన్ రావు పరిశీలించారు.
'నారాయణపురం కాలువ నుంచి గ్రామాలకు సాగునీరు అందించండి' - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని నారాయణపురం ఆనకట్ట కాలువలోని నీరు విడిచిపెట్టక పోవడం వలన దిగువ గ్రామాలకు సాగునీరు అందట్లేదని భాజపా, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్ మండలాలకు సంబంధించి సుమారు 2వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుందని.. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఛానల్‌కు మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. దీంతో దిగువ ఉన్న రావికంటిపేట, కొర్లకోట, కట్యాచార్యులపేట, వెదుర్లవలస, హనుమంతుపురం, తురకపేట, బొబ్బిలిపేట తదితర గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల వరి పంట ఎండకు ఎండి పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత