ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి' - ఆమదాలవలస భాజపా సమావేశం తాజా వార్తలు

ఆమదాలవలసలో భాజపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని భాజపా నియోజకవర్గ ఇంఛార్జ్​ గడ్డయ్య పేర్కొన్నారు.

bjp constituency meeting in amadalavalasa
భాజపా నియోజకవర్గ ఇంఛార్జ్​ గడ్డయ్య

By

Published : Oct 8, 2020, 11:47 PM IST

ఆమదాలవలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో గురువారం భాజపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జి పాతిన గడ్డయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పగ్గాలను భాజపా నాయకులు చేపడతారని ఆయన తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టాక.. రాష్ట్రంలో పార్టీ పుంజుకుందన్నారు. భాజపా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details