శ్రీకాకుళంలో అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక యువకుడకు తీవ్ర గాయాలు అవ్వడంతో జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్ర వాహనంపై హైస్పీడ్ లో ఏడు రోడ్ల కూడలి నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వైపు వెళ్తుండగా కృష్ణాపార్కు సమీపంలో ప్రమాదం సంభవించింది. దీంతో ఇద్దరు యువకులను జీజీహెచ్ కు తరలించారు. బైక్ నెంబర్ ఆధారంగా రాగోలు చెందిన యువకులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్నబైక్.... ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం - BIKE ACCIDENT NEWS IN SRIKAKULAM
ద్విచక్ర వాహనంపై అతివేగంతో వెళ్తున్న యువకుడు... అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కృష్ణాపార్కు రోడ్డులో జరిగింది.
డివైడర్‌ను ఢీకొన్నబైక్.... ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం