ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాలర్ల వలలకు చిక్కిన రెండున్నర టన్నుల సొరచేప - మత్స్యకారుల వలలకు చిక్కిన సొర చేప

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో రెండున్నర టన్నుల బరువున్న సొరచేప చిక్కింది. అయితే దాన్ని రక్షించేందుకు జాలర్లు ప్రయత్నం చేసినా.. అప్పటికే చనిపోయింది. చేపను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున సముద్ర తీరానికి తరలివచ్చారు.

big fish caught in a net of fishermen
జాలర్ల వలలకు చిక్కిన రెండున్నర టన్నుల సోరచేప

By

Published : Jan 11, 2021, 3:13 AM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలంలో మత్స్యకారుల వలలకు సొరచేప చిక్కింది. బందరువానిపేట, కొమరవానిపేట జాలర్లు చేపల కోసం వేసిన వలలో 25 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 2 టన్నుల బరువున్న పులిబజ్జల సొర చేప పడింది. జాలర్లు.. వలలు కోసి చేపను రక్షించే ప్రయత్నించారు. అయితే అప్పటికే అది చనిపోయింది. ఈ పులిబజ్జల సొర చేపను చూసేందుకు స్థానికులు సముద్ర తీరానికి తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details