శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర గ్రామంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినం సందర్భంగా గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం వద్ద వేలాది ఆరటి గెలలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 5వేలకు పైగా అరటి గెలలు కట్టడం ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భారీగా పందిరి వేసి అరటి గెలలు వేలాడ దీసి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు చేశారు. తమ కోరికలు నెరవేరుతున్నందున స్వామిని దర్శించుకుని అరటి గెల కడుతున్నట్లు పలువురు భక్తులు తెలిపారు.
250 ఏళ్ల క్రితం..