ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్ - srikakulam district newsupdates

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో భారత్​ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్​కు మద్దతుగా వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Absolute bandh continues in Srikakulam district
భారత్ బంద్​కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్ధతు

By

Published : Dec 8, 2020, 12:12 PM IST

Updated : Dec 8, 2020, 6:22 PM IST

శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు నిలిపేశారు. దిల్లీలో రైతులు చేపడుతున్న నిరసనకు సంఘీభావంగా...కేంద్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా బంద్ చేపట్టామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఆమదాలవలస మండలం లొద్దలపేటలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దిల్లీ సరిహద్దుల్లో చలిలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు.

Last Updated : Dec 8, 2020, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details