ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్​ - today bharat Bandh latest news update

శ్రీకాకుళం జిల్లాలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రధాన తపాల కార్యాలయం వద్ద తెదేపా, వామపక్షాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

bharat Bandh in Srikakulam
శ్రీకాకుళం జిల్లాలో భారత్ బంద్​

By

Published : Mar 26, 2021, 5:28 PM IST

శ్రీకాకుళం జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట తెలుగుదేశం పార్టీ, వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రామలక్ష్మణ కూడలి వద్ద బైక్‌ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్‌ కారణంగా జిల్లాలోని వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి.

ఆమదాలవలసలో భారత బంద్..

ఆమదాలవలసలో భారత బంద్ సందర్భంగా.. తెదేపా నాయకులు, సీఐటీయు నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకరాజు, తెదేపా నాయకులు తమ్మినేని విద్యాసాగర్, మొదలవలస రమేష్ లతోపాటు నాయకులు కార్యకర్తలు, సీఐటీయు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

ఇచ్ఛాపురంలో కరోనాపై అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details