శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఘర్షణల్లో భాజపా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వైకాపా నాయకులు ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించగా.. అదే వేదిక ఎదురుగా కొంతమంది భాజపా కార్యకర్తలు తమ ఇళ్లపై భాజపా జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు. ఆత్మీయ సమావేశం ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో భాజపా కార్యకర్తల ఇళ్లపైన ఉన్న ఫ్లెక్సీలను తొలగించటంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పికెటింగ్ కొనసాగిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇంతవరకు ఇరువర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు.
బంటుపల్లిలో భాజపా, వైకాపా వర్గీయుల ఘర్షణ.. ఉద్రిక్తత
భాజపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలో భాజపా కార్యకర్తలకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని బంటుపల్లిలో జరిగింది.
బంటుపల్లిలో భాజపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ