గ్రామానికి సమీపంలో ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల ఆందోళన - sikakulam dst mro office latest news
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వాండ్రంగి పరిధిలోని సిడిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తాము నివసిస్తోన్న గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఎలా బ్రతికేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు