శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆంధ్రాబ్యాంకు వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తీసుకోవడానికి లబ్ధిదారులు ఇలా బ్యాంకుల ముందు గుంపులుగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేశారు.
బ్యాంకుల ఎదుట గుంపులుగా జనం... కారాదు ప్రమాదం! - jandhan
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రైతుఖాతాల్లో నగదును జమ చేసింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈ సొమ్మును తీసుకునేందుకు లబ్ధిదారులు గంపులుగా చేరారు. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విధమైన చర్యలతో కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

రాజాంలో ఆంధ్రాబ్యాంకు ఎదుట భౌతిక దూరం పాటిస్తున్న లబ్ధిదారులు