BEARS: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తీర ప్రాంతాలైన కొండపల్లి, అనకాపల్లి, గునుపల్లి, మెట్టూరు, అక్కుపల్లి, చినవంక, బాతుపల్లి, బహాడపల్లి, ఎఱ్ఱముక్కాం తదితర పరిసరాల్లోని తోటల్లో కొద్ది నెలలుగా ఎలుగుబంట్లు జోరుగా సంచరిస్తున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట కనిపిస్తూ.. ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇళ్ళల మధ్య లోకి వచ్చి ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. గ్రామాల్లోకి రాకుండా.... అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
BEARS: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల హల్చల్ - srikakulam district news
BEARS:శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా గ్రామాల్లోనే సంచరిస్తూ...ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల హల్చల్
Last Updated : Dec 12, 2021, 2:16 AM IST