ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ప్రజలు ఏర్పాటు చేసిన బోనులో ఓ ఎలుగుబంటి చిక్కింది. గ్రామంలో తరచుగా ఎలుగుబంటి దాడులు చేయడం... ఆ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంత మంది తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యారు.
బోనులో పడిన ఎలుగు... ఊపిరి పీల్చుకున్న స్థానికులు - bear fell on bone news in erramukkam
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఓ ఎలుగుబంటి గ్రామస్థులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. గత కొంత కాలంగా సోంపేట మండలంలోని గ్రామాల్లో ఎలుగుబంటి దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోగా.... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

బోన్లో పడిన ఎలుగుబంటి
ఎలుగుబంటి ప్రమాదం ఉన్న ప్రాంతాలకు అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవటంతో ఎర్రముక్కాం గ్రామానికి చెందిన యువకులే ఎలుగును బంధించడానికి ఇనుప బోనును తయారు చేశారు. బోను ఏర్పాటు చేసిన సుమారు పది రోజుల తర్వాత బుధవారం రాత్రి ఎలుగు బోనులో చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగు గట్టిగా అరుస్తుండటంతో గ్రామస్థులు ఎవరు బోను వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు.
ఇదీ చూడండి:డ్రోన్‌ను చూడగానే... పరుగుతీశారు...
Last Updated : Jun 4, 2020, 4:09 PM IST