లాక్‌డౌన్ భారం నుంచి ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని తీసుకునేందుకు మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్ద జన్‌ధన్ ఖాతాదారులు బారులు తీరారు. జన్‌ధన్ ఖాతాల్లో 500 రూపాయలు, పీఎం కిసాన్ యోజన ఖాతాల్లో 2 వేల రూపాయలను కేంద్రం జమ చేసింది. ఆ మొత్తాన్ని తీసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బ్యాంకులన్నీ రద్దీగా మారాయి. మూడు రోజుల సెలవులు తరువాత బ్యాంకులు తెరవటంతో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులకు క్యూ కట్టారు. వీరు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అమదాలవలసలో బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం - banks rush at amdhalavalsa
మూడు రోజులు సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకోవడంతో ప్రజలు బ్యాంకులకు క్యూ కట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బ్యాంకులన్నీ కిటకిటలాడాయి.
అమదాలవలసలో బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం