Bank Employee Fraud:శ్రీకాకుంళం జిల్లా కుంటిభద్ర గ్రామానికి చెందిన ఓ యువకుడు.. పాలకొండలో స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు విభాగంలో క్రాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలని పథకం రచించిన యువకుడు.. క్రెడిట్ కార్డు పొంది వాటిని వినియోగించని వారి వివరాలు సేకరించాడు. సదరు వినియోగదారులకు ఫోన్ చేసి.. మీరు క్రెడిట్ కార్డు వాడటం లేదని.. వాడకపోతే అదనపు రుసం చెల్లించాల్సి వస్తుందని నమ్మబలికాడు. అదనపు రుసుం చెల్లించకుండా ఉండాలంటే మీరు పొందిన క్రెడిట్ కార్డులను తిరిగి అప్పగించాలని చెప్పాడు.
అనవసరంగా డబ్బు చెల్లిచటం ఇష్టంలేని పలువురు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను యువకుడికి తిరిగి ఇచ్చేశారు. కార్డులను బ్యాంకు అధికారులకు అప్పగించకుండా ఆ యువకుడే ఖాతాదారుల పేరిట తన సొంత అవసరాలకు వినియోగించటం మెుదలు పెట్టాడు. వాడిన క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి ఖాతాదారులకు సమాచారం అందటంతో వారంతా బ్యాంకు అధికారులను సంప్రదించారు.