ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూన రవికుమార్​కు బెయిల్ మంజూరు - కూన రవికుమార్ కు బెయిల్ మంజూరు వార్తలు

తెదేపా నేత కూన రవికుమార్.. అతని అనుచరులకు బెయిల్ మంజూరయ్యంది. పొందూరు పూర్వ తహసీల్దార్ ను అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ బెదిరించారన్న దానిపై కేసు నమోదయ్యిందన్న విషయం తెలిసిందే.

Bail granted to Kuna Ravikumar at pondoor police station in Srikakulam district
Bail granted to Kuna Ravikumar at pondoor police station in Srikakulam district

By

Published : May 28, 2020, 8:07 AM IST

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తో పాటు.. అతని అనుచరులకు బెయిల్ మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం వారంతా లొంగిపోయారు. ఈ నెల 24న పొందూరు పూర్వ తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను రవికుమార్ అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు రవికుమార్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న తెదేపా నేత బుధవారం లొంగి పోయారు. వీరిని పొందూరు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి షేక్ రియాద్.. కేసు పూర్వపరాలు పరిశీలించారు. స్టేషన్లో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించారు. బెయిల్ పై బయటకి వచ్చిన మాజీ విప్.. న్యాయపోరాటం చేస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details