ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​.. వాడవాడలా మువ్వన్నెల జెండా ప్రదర్శనలు - మువ్వన్నెల పతాకంతో ర్యాలీలు

Azadi ka Amrit Mahotsav.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా...వాడవాడలా జెండా ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మువ్వన్నెల పతాకంతో ర్యాలీలు నిర్వహించారు.

Azadi ka amrit mahotsav
Azadi ka amrit mahotsav

By

Published : Aug 10, 2022, 10:15 PM IST

Flag march.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా..ఆంధ్ర విశ్వవిద్యాలయం.. డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ లా కళాశాల ఆధ్వర్యంలో.. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లపేటలో విద్యార్థులు.. భారీ ప్రదర్శన చేశారు. విజయవాడ లయోలా కళాశాల ఎన్సీసీ విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఎన్సీసీ విద్యార్థులు జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కృష్ణా జిల్లా కురుమద్దాలిలో సంధ్యా ఆక్వా పరిశ్రమ సిబ్బంది..జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించింది.

Har ghar tiranga.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీపీ రెడ్డి గ్రూప్స్ స్కాలర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 12 వందల 50 అడుగుల భారీ జాతీయ జెండాతో 2 వేల మంది విద్యార్థులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. నరసరావుపేటలో వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీలో కలెక్టర్ శివశంకర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

national flag.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కర్నూలులో వెయ్యి మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో కొండారెడ్డి బురుజు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​.. వాడవాడలా మువ్వన్నెల జెండా ప్రదర్శనలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details