మాదక ద్రవ్యాలను అరికట్టే అంశంపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అమిత్ బర్దార్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ చెప్పారు.
యువత డ్రగ్స్‌కు అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. అనంతరం దిశ యాప్ పై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు.