ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - శ్రీకాకుళం
ప్లాస్టిక్ చేసే అనర్థాలను ప్రజలకు వివరించటమే లక్ష్యంగా ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం విద్యార్థులు అవగాహనా ర్యాలీ చేపట్టారు. ప్రాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. పాస్టిక్ సంచుల వినియోగ నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్లల్లో ర్యాలీలు చేశారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలంటూ అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను విద్యార్థులు నినాదాలతో వివరించారు. ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు అంటూ విద్యార్థులు చేసే నినాదాలు అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.
ఇదీ చూడండి:
పాపం గర్భిణులు.. తప్పట్లేదు డోలీ మోతలు!