శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం సాయంత్రం పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో... కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ జరిగింది. జమ్ము కూడలి నుంచి సత్యవరం కూడలి వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. నరసన్నపేట ఎస్ఐలు సత్యనారాయణ, శంకర్రావు, ఈవో ఆర్డీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కరోనాపై పోలీసుల అవగాహన ర్యాలీ - srikakulam covid news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనాపై అవగాహన ర్యాలీ జరిగింది. పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
నరసన్నపేటలో కరోనా పై పోలీసుల అవగాహన ర్యాలీ